Weekly Horoscope: 10 ఏప్రిల్‌ నుంచి 16 ఏప్రిల్‌ వరకు..

10 Apr, 2022 06:30 IST|Sakshi

వారఫలాలు..

మేషం...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

వృషభం...
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన ఇబ్బందులు కొన్ని తీరతాయి. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సకాలంలో నిర్వర్తిస్తారు. కళాకారులకు ఊహించని కొన్ని అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం...
అనుకున్న పనులు  కొంత మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.  ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలతో కొంత కుస్తీపడతారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. మిత్రులు మీపై ఒత్తిడులు పెంచవచ్చు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు కొంత పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

సింహం...
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు రాగలవు. ఉద్యోగాలలో మీ అనుభవాన్ని వినియోగించుకుంటారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. బంధువర్గంతో తగాదాలు.  లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య....
కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. అందరిలోనూ తగిన గుర్తింపు పొందుతారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు  కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు.  కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. సోదరులతో విభేదాలు. అనారోచగ్యం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల....
కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. విద్యార్థుల నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు జరగవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి, కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. వారం మ«ధ్యలో ధనవ్యయం. ఆప్తులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం..
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు దక్కే ఛాన్స్‌. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో లేనిపోని వివాదాలు.  ఖర్చులు పెరుగుతాయి. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

ధనుస్సు...
కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో సఖ్యత. పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కళాకారుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

మకరం...
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి.  ఆస్తి విషయంలో ఇబ్బందులు అధిగమిస్తారు.  కీలక హోదాలు కలిగిన వారితో పరి^è యాలు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.  పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం...
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు కొన్ని  గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవర్గాలకు వివాదాల నుంచి విముక్తి, ప్రజాదరణ పెరుగుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం....
కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.  వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతమైన సమయం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మరిన్ని వార్తలు