2021లో రాబోయే బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్

1 Jan, 2021 17:19 IST|Sakshi

2020 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా మొబైల్ పరిశ్రమ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది. అందుకే 2021లో చాలా వరకు కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ వినియోగదారులు కూడా 2021లో రాబోయే కొత్త ఉత్పత్తుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 13 వంటి హై-ప్రొఫైల్ హ్యాండ్‌సెట్‌ల నుంచి ఎల్‌జి రోలబుల్ వంటి మొబైల్స్ కూడా రానున్నాయి. ఈ ఏడాదిలో మొబైల్ సంస్థలు తీసుకురాబోయే కొన్ని ఆసక్తికరమైన 10 స్మార్ట్‌ఫోన్స్ మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్)

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్
కొత్త ఏడాదిలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్స్ ముందు రానున్నట్లు తెలుస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ లో గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా వంటి మోడల్స్ తీసుకు రానున్నట్లు సమాచారం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్స్ ను జనవరి 14న మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ప్రాంతాన్ని బట్టి దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్(యుఎస్‌లో) లేదా ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తీసుకురానున్నారు. 

ఐఫోన్ 13 సిరీస్
ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ కంటే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు మొబైల్ యూజర్లు. కానీ ఈ ఫోన్ మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. 

వన్‌ప్లస్ 9 సిరీస్
వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి లేదా ఏప్రిల్ లో నెలలో తీసుకురానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ లో స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌ను తీసుకొనిరావచ్చు. దీనిలో 48మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 48మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. 

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3
శామ్‌సంగ్ భవిష్యత్ లో తీసుకురాబోయే మొబైల్ ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3కి ఎక్కువ బజ్ ఏర్పడుతుంది. శామ్‌సంగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్క్రీన్‌లో కెమెరాను తీసుకురానున్నట్లు సమాచారం. 

ఎల్జీ రోలబుల్
ఎల్జీ రోలబుల్ మొబైల్ మార్కెట్ లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పేటెంట్ ప్రకారం ఎడమ, కుడి స్క్రీన్ అంచులను డ్రాగ్ చేసుకోవచ్చని తెలుస్తుంది. లీక్ ప్రకారం ఇది 6.8 అంగుళాల నుండి 7.4 అంగుళాల వరకు విస్తరించవచ్చు.


ఒప్పో ఫైండ్ ఎక్స్ 3 సిరీస్ 
ఒప్పో కూడా శామ్‌సంగ్ లేదా వన్‌ప్లస్ లాగా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దింట్లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 3 సిరీస్ మొబైల్ ఫోన్లు తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనిని మొదటి త్రైమాసికంలో తీసుకురానున్నట్లు సమాచారం.  

నోకియా 10
నోకియా 10 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. రోజురోజుకి దీని పేరు మారిపోతుంది. మొదట దీనిని నోకియా 9.1 పేరుతో తీసుకురావాలని భావించారు. కానీ తరువాత నోకియా 9.2, 9.3 వంటి పేర్లను మార్చుతూ పోయింది. ఇప్పుడు 2021లో నోకియా 10 పేరుతో తీసుకురానున్నట్లు సమాచారం. దింట్లో కూడా స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. 

  
ఐఫోన్ ఎస్ఈ 3
ఐఫోన్ 13 సిరీస్ తో పాటు 2021లో ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 3 మొబైల్ ని తీసుకురానున్నట్లు సమాచారం. దింట్లో ఆపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇది పెద్ద 5.5 లేదా 6.1-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

 
సోనీ ఎక్స్‌పీరియా 1 III 
సోనీ ఎక్స్‌పీరియా 1 III పేరుతో ఒక మొబైల్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. ఈ మొబైల్ 5.5-అంగుళాల స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. 

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 21 సిరీస్
శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 21 సిరీస్ మొబైల్ తీసుకొస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 తీసుకొస్తున్నారు కాబట్టి దీనిని నిలిపివేయవచ్చు అని సమాచారం. దీని యొక్క సేల్స్ కూడా పడిపోయినట్లు ఇటీవల సమాచారం వచ్చింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు