రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!

6 Dec, 2022 10:02 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2024 చివరి నాటికి 10,000 సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్‌ సినిమాస్‌తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష చిన్న థియేటర్లను నెల కొల్పాలన్నది  లక్ష్యం. ఒక్కో కేంద్రం 100-200 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుంది.

సీఎస్‌సీని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమోట్‌ చేస్తోంది. 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లను తెరవాలనే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ వెల్లడించారు. (ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు)

2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10,000 సినిమా హాళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని అక్టోబర్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దేశాయ్ తెలిపారు. వీడియో పార్లర్ సినిమా లైసెన్సు ఉన్న ఈ సినిమా హాళ్లను నడపాలంటే దాదాపు రూ.15 లక్షల పెట్టుబడి అవసరమన్నారు. గ్రామీణ స్థాయి వ్యాపారులకు కొత్త అవకాశాలను ఈ థియేటర్లు కల్పిస్తాయని సీఎస్‌సీ భావిస్తోంది. సీఎస్‌సీ కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారతాయని ఆశిస్తోంది.    (కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!)

మరిన్ని వార్తలు