బోనస్‌ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్‌ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్‌

14 Apr, 2023 21:50 IST|Sakshi

ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.

(Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!)

తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్‌ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్‌ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు.

తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు.

(Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..)

యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్‌ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్‌ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే జాయినింగ్‌ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్‌లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్‌ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్‌ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు.

(Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...)

మరిన్ని వార్తలు