Aditya Birla Q1 Results: ఏబీ క్యాపిటల్‌ రికార్డు లాభం.. కంపెనీ చరిత్రలోనే అత్యధికం

4 Aug, 2022 09:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 429 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 302 కోట్లు ఆర్జించింది.

కాగా.. మొత్తం ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 5,859 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 4,632 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. జూన్‌కల్లా నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్, గృహ రుణాల బుక్‌ 22 శాతం బలపడి రూ. 69,887 కోట్లకు చేరింది. జీవిత, ఆరోగ్య బీమా విభాగం స్థూల ప్రీమియం 53 శాతం జంప్‌చేసి రూ. 3,250 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 106 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు