పెప్సీ కొంటే.. కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ పండుగ ఆఫర్

7 Sep, 2022 15:25 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండుగ ఆఫర్‌నుప్రకటించింది. రీఛార్జ్ కూపన్స్‌  అందించేలా పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెప్సీ కంపెనీ డ్రింక్స్‌  కొనుగోలు చేసిన వినియోగ దారులకు రీచార్జ్‌ కూపన్లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఇలాంటి భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు.

పండుగ సీజన్‌కు ముందుప్రీపెయిడ్ వినియోగదారులకు రీఛార్జ్ కూపన్‌లను అందించడానికి ఎయిర్‌టెల్ పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఇందులో భాగంగా పెప్సీ, మౌంటైన్ డ్యూ, మిరిండా, 7UP, స్లైస్, ట్రోపికానా పెట్‌ బాటిళ్లతో సహా పెప్సీ ఇతర పానీయాలను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 10 నుండి రూ. 20 విలువైన ఎయిర్‌టెల్ రీఛార్జ్ కూపన్‌లు లభిస్తాయి. పెప్సీ ప్రత్యేక ఎడిషన్ బాటిళ్లలో  లేబుల్ వెనుక వైపు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. 12 అంకెల  కోడ్ కూపన్‌ను  ద్వారా రీచార్జ్‌ కూపర్లను రిడీమ్‌ చేసుకోవచ్చు. 

ఇందుకోసం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కనీసం రూ. 99 రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నంబర్‌కు, డిస్కౌంట్ కోడ్‌లు రెండుసార్లు మాత్రమే పని చేస్తాయి. ఎయిర్‌టెల్ పెప్సికో  ఆఫర్ ఫిబ్రవరి 2023 వరకు వినియోగ దారులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ మార్కెటింగ్ , కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు