పండుగ సీజన్‌లో అమెజాన్‌ జోష్‌.. 13 ఏళ్లలో ఇదే బెస్ట్‌!

8 Nov, 2023 09:12 IST|Sakshi

కోల్‌కత: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా పండుగల సీజన్‌తో జోష్‌ మీద ఉంది. దేశంలో తన 13 సంవత్సరాల కార్యకలాపాలలో ప్రస్తుత సీజన్‌ అత్యుత్తమంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రతి విభాగంలోనూ ఇదే అత్యుత్తమ సంవత్సరమని అమెజాన్‌ కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, పర్సనల్‌ కంప్యూటింగ్, లార్జ్‌ అప్లయాన్సెస్‌ డైరెక్టర్‌ నిశాంత్‌ సర్దానా తెలిపారు.

‘కోవిడ్‌ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే డిమాండ్‌లో పునరుద్ధరణను సూచించే గ్రామీణ కొనుగోళ్లలో అమెజాన్‌ ఎలాంటి మందగమనాన్ని చూడలేదు. 80 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి, నాల్గవ తరగతి మార్కెట్ల నుంచి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు బలమైన వృద్ధిని కనబరిచాయి. పండుగల సీజన్‌ కోసం దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించాం’ అని వివరించారు. ప్రస్తుత పండుగల సీజన్‌లో ఈ–కామర్స్‌ కంపెనీల వ్యాపారం 18–20 శాతం వృద్ధితో రూ.90,000 కోట్లు నమోదు చేయవచ్చని రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు