Apple iPhone 13 : యాపిల్‌ అదిరిపోయే ఆఫర్‌, ఐఫోన్‌ 13పై రూ.46వేల వరకు..

23 Sep, 2021 13:48 IST|Sakshi

ఐఫోన్‌ లవర్స్‌కు టెక్‌ దిగ్గజం యాపిల్‌ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది.సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్‌ 13 లవర్స్‌  'ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌'లో పాల్గొనాల్సి ఉంటుంది.


 
ఎక‍్సేంజ్‌ ఆఫర్లు ఎలా ఉన్నాయి
ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో ఐఫోన్‌ 12ప్రో మ్యాక్స్‌ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్‌ 12 ప్రో పై రూ.43,255, బేసిక్‌ ఐఫోన్‌ 12పై రూ.31,120, ఐఫోన్‌ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఫోన్‌ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు.   

ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో ఎలా పాల్గొనాలి
యాపిల్‌ ఆన్‌లైన్‌ షాప్‌ ద్వారా ఐఫోన్‌13 ఫోన్‌ బుక్‌ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్‌ లైన్‌లో జరిగే ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో యాపిల్‌ సంస్థ మీ పాత ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్‌ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్‌ 13 ఫోన్‌ ను బుక్‌ చేసుకోవచ్చు. అనంతరం ఆన్‌లైన్‌లో మీకు ఐఫోన్‌ 13ఫోన్‌ డెలివరీ టైం, డేట్‌ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్‌ ప్రతినిధులు   ఐఫోన్‌ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు.  

ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో ఐఫోన్‌ 13ను తీసుకోవాలి 
ఐఫోన్‌ 13 డెలివరీ టైంకు ట్రేడ్‌ ఇన్‌ ఆప్షన్‌లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్‌ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్‌ పై ట‍్రేడ్‌ ఇన్‌ ఆప్షన్‌ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్‌, ఆండ్రాయిండ్‌ ఫోన్‌లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్‌ ఇన్‌ ఆప్షన్‌ లో మీరు మీఫోన్‌ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్‌ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్‌లైన్‌ లో అప్రూవల్‌ ఇస్తారు. ఐఫోన్‌ 13ను మీకు ఆఫర్‌ ప్రైస్‌కే అందిస్తారు.

చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్​ లీక్.. మాములుగా లేవుగా! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు