మోదీజీ వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్‌: ఫాక్స్‌కాన్‌ పోస్ట్‌ వైరల్‌

18 Sep, 2023 13:41 IST|Sakshi

 ఇండియాలో రెట్టింపు ఉద్యోగాలు : ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధి

ఫాక్స్‌కాన్‌ విస్తరణ ప్లాన్స్‌ : వేలాది ఉద్యోగాలు

యాపిల్‌ ఐఫోన్‌ తయారీదారు తైవాన్‌కు చెందిన పాక్స్‌కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ అందించనుంది.  భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది.  భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్‌కాన్‌ ప్రతినిది  లింక్డ్‌ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు.  

ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్‌డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్‌కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది  గొప్ప  బహుమతి అందించేలా మరిన్ని విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు,  రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో  మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు.

చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా  ఐఫోన్‌ విక్రయాలకు పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్‌లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!)

ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్  డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్‌ల  కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్‌ చతుర్థి:  ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు)

గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్‌పై  భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు