యాపిల్‌ గుడ్‌న్యూస్‌: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!

11 Nov, 2022 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దాదాపు అన్ని టెక్‌ దిగ్గజాలన్నీ ఉద్కోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ఇండియాలోని ఫ్యాక్టరీలో వర్క్‌ఫోర్స్‌ను నాలుగు రెట్లు పెంచాలని యోచిస్తోంది. ట్విటర్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌,లాంటి దిగ్గజాలు వేలమందిని ఉద్యోగులను తొలగించాయి. తాజాగా అమెజాన్‌ అదే బాటలో  ఉన్న నేపథ‍్యంలో యాపిల్‌ నిర్ణయం విశేషంగా నిలిచింది.  ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స​మాచారం. 

ఇదీ  చదవండి: అమెజాన్‌లో పింక్‌ స్లిప్స్‌ కలకలం, వేలమందిపై వేటు!

చైనాలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ అయిన జెంగ్‌జౌ ప్లాంట్‌ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల షిప్‌మెంట్‌లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ డిమాండ్‌ను నెరవేర్చే యోచనలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ ఇండియాలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను పెంచుకోనుంది. రానున్న రెండేళ్లలో  ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని భావిస్తోంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని తన ప్లాంట్‌లో వచ్చే రెండేళ్లలో మరో 53వేల మంది కార్మికులను చేర్చుకోవడం ద్వారా వర్క్‌ఫోర్స్‌ను 70వేలకి పెంచాలని యోచిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు వెల్లడించాయి. (ప్రేమలో పడిన మిలిందా గేట్స్‌, కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?)

2019లో  తమిళనాడులోని  యాపిల్‌ ఐఫోన్‌  ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది.  క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటూ ఈ ఏడాది ఐఫోన్14 ఉత్పత్తిని షురూ చేసింది. అయితే 2 లక్షల కార్మికులున్న  జెంగ్‌జౌ ప్లాంట్‌తో పోలిస్తే ఇది చిన్నదే అయిన్పటికీ చైనా తరువాత ఇది చాలా ప్రధానమైంది. అయతే తాజావార్తలపై ఫాక్స్‌కాన్‌, యాపిల్‌  స్పందించేందుకు నిరాకరించాయి. 

(క్లిక్‌:StockMarketClosing: బుల్‌ ర్యాలీ, జోష్‌కు ఐదు కారణాలు)

మరిన్ని వార్తలు