AsmiJain ఫ్రెండ్‌ అంకుల్‌ కోసం: ఇండోర్‌ అమ్మడి ఘనత

31 May, 2023 12:05 IST|Sakshi

యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌ గెల్చుకున్న ఇండోర్‌ అమ్మాయి

హెల్త్‌కేర్‌ యాప్‌తో ఆకట్టుకున్న అస్మిజైన్‌

సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 20 ఏళ్ల అస్మీ జైన్ ప్రఖ్యాత యాపిల్‌ WWDC23 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌ని గెల్చుకుంది. స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అద్భుతమైన ఒరిజినల్‌ యాప్‌ను రూపొందించనందుకుగాను ఈ ఘనతను దక్కించుకుంది. అస్మి జైన్‌తో పాటు, ఈ ఏడాది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో మార్టా మిచెల్ కాలియెండో , యెమి అజెసిన్   కూడా ఉన్నారు.

వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో (ఈసంవత్సరం జూన్ 5న)కి ముందు, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ ప్లేగ్రౌండ్‌ చాలెంజ్‌ను నిర్వహిస్తుంది. గ్లోబల్ యాపిల్‌ డెవలపర్ కమ్యూనిటీకి  WWDC23 ఈవెంట్‌ను వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఛాలెంజ్ విజేతలకు కూడా అనుమతి ఉంటుంది. 

బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న తన స్నేహితురాలి మేనమామకు సహాయం చేసేలా యాప్‌ను రూపొందించి ఈ అవార్డును దక్కించుకుంది. బ్రెయిన్ సర్జరీ కారణంగా కంటి అంగ వైకల్యంతో పాటు ముఖం పక్షవాతానికి గురైంది. దీంతో ఇండోర్‌లోని మెడి-క్యాప్స్ యూనివర్శిటీకి చెందిన జైన్  రంగంలోకి దిగింది. స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యూజర్‌కంటి కదలికలను ట్రాక్ చేయడానికి యాప్‌ ప్లేగ్రౌండ్‌ని డిజైన్ చేసింది. దీని ప్రాథమిక ఉద్దేశ్యం కంటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటం.  అయితే వివిధ రకాల కంటి పరిస్థితులు, గాయాలైన సందర్భాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని జైన్ భావిస్తోంది. ఇది ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడడమే తన తదుపరి లక్ష్యం అని కూడా చెప్పింది. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్‌ సంచలన వ్యాఖ్యలు)

హెల్త్‌ చాలెంజెస్‌ ఎదుర్కొనేలా కోడింగ్‌ని ఉపయోగించి యాపల్‌ ప్లే గ్రౌండ్‌ రూపకల్పనలో పట్ల జైన్‌కు అభిరుచే ఆమెను ఈ స్థాయిలో ఉంచింది. అలాగే జైన్ తోటి విద్యార్థులతో కలిసి  విశ్వవిద్యాలయంలో ఒక ఫోరమ్‌ను  కూడా స్థాపించారు. ఈ ప్లాట్‌ఫారమ్  సపోర్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ఎవరిదో తెలుసా? )

కాగా ప్రతీ ఏడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ రూపొంచే చాలెంజ్‌ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకిస్తుంది. గతంతో పోలిస్తే విజేతల సంఖ్యను  350 నుంచి 375కి పెంచామనీ, తద్వారా మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ఈ ఈవెంట్‌లో చేరవచ్చని భావించినట్టు తెలిపింది. 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, వినోదం, పర్యావరణం లాంటి  విభిన్న టాపిక్స్‌ ఇందులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

మరిన్ని  స్ఫూర్తిదాయక, విజేతల కథనాలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి : సాక్షిబిజినెస్‌ 

మరిన్ని వార్తలు