బజాజ్ పల్సర్ 150 కంటే ఖరీదైనదిగా పల్సర్ ఎన్ఎస్ 125 బైక్

19 Jul, 2021 18:17 IST|Sakshi

బజాజ్ ఆటో ఇటీవల తన పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ ధరను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా ధరల భారీగా పెరగడంతో పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ బైక్, పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ కంటే ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం ఈ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ మోటార్ సైకిల్ ధర ఇప్పుడు షోరూమ్ లలో రూ.99,296(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) ధరకు లభిస్తోంది. మునుపటి ధరలతో పోలిస్తే ఇప్పుడు దీని ధర రూ.4,416 పెరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే, ప్రస్తుతం పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ ధర రూ.98,259(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) కంటే పల్సర్ ఎన్ఎస్125 ధర రూ.1,037 ఎక్కువ.

ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న 125 సీసీ మోటార్ సైకిళ్లలో ఎన్ఎస్ 125 ఒకటి. ఈ బైక్ సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ స్టైల్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ప్రస్తుతం సింగిల్ వేరియెంట్‌లో మాత్రమే లభ్యం అవుతోంది.

వినియోగదారులకు బర్న్డ్ రెడ్, ప్యూటర్ గ్రే, ఆరెంజ్, సఫ్ ఫైర్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్ 124.45సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.6 హెచ్ పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఐదు గేర్లు ఉన్నాయి. మోటార్ సైకిల్ సస్పెన్షన్ సిస్టమ్ లో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ముందే ఉంటే, వెనుక రియర్ మోనోషాక్ ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు