కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో త్వరలో విడుదల కానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు!

3 Apr, 2023 15:26 IST|Sakshi

భారతదేశం కేవలం కార్లు, బైకులకు మాత్రమే కాకుండా.. స్మార్ట్‌ఫోన్‌లకు కూడా అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది. కావున ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో ఆధునిక మొబైల్స్ విడుదలవుతూనే ఉన్నాయి. శాంసంగ్‌, ఆపిల్, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీ ప్రతి సంవత్సరం అనేక కొత్త మోడల్స్ పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నెలలో (2023 ఏప్రిల్) ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మొబైల్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

పోకో ఎఫ్5 (Poco F5):
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో ఏప్రిల్ 06న తన 'ఎఫ్5' మొబైల్ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్  కలిగి 8GB RAM & 128 GB ఇంటర్నల్ మెమరీ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,500 mAh వరకు ఉంటుంది. దీని ధర రూ. 5,000 వరకు ఉండవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ సి‌ఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite):
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో ఒకటి వన్ ప్లస్. ఇప్పటికే అనేక కొత్త మోడల్స్ విడుదల చేసిన ఈ కంపెనీ ఏప్రిల్ 04న 'నార్డ్ సి‌ఈ 3 లైట్' విడుదల చేయనుంది. ఈ మొబైల్ 6.72 ఇంచెస్ LCD స్క్రీన్ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh కాగా.. రామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB/128GB వరకు ఉన్నాయి. ఇది సుమారు రూ. 25,000 వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 7 (Asus ROG Phone 7):
ఆసుస్ కంపెనీ ఈనెల 13న దేశీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆర్ఓజి ఫోన్ 7 విడుదలచేయనుంది. ఇది 6.85 ఇంచెస్ AMOLED స్క్రీన్ కలిగి 16 GB రామ్ 512 GB ఇంటర్నల్ మెమొరీ పొందుతుంది. అయితే ఇందులో 6,000 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీని ధర సుమారు రూ. 63,000 వరకు ఉండవచ్చని అంచనా.

(ఇదీ చదవండి: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..)

వివో ఎక్స్90 సిరీస్ (Vivo X90 Series):
2023 ఏప్రిల్ నెలలో వివో కంపెనీ కూడా కొత్త 'ఎక్స్90 సిరీస్' విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదాని మీద ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ ఇది 6.78 ఇంచెస్ AMOLED స్క్రీన్, 4,810 mAh బ్యాటరీ, 12 జిబి - 16 జిబి రామ్, 512 GB ఇంటర్నల్ కెపాసిటీ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందనుంది. దీని ప్రారంభ ధర రూ. 42,500 వరకు ఉండవచ్చు.

మరిన్ని వార్తలు