-

భారత్ బయోటెక్‌.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?

28 Nov, 2023 14:17 IST|Sakshi

హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది.

ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్‌తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

కొత్త వ్యాక్సిన్‌లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్‌ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు.

కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్‌లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు