-

​HYD: పైగా టూంబ్స్ అనుభూతి చెందిన అంధులు

28 Nov, 2023 15:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన  అనుభూతిని కలిగించాలన్న  ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి  చార్మినార్‌కు దగ్గరలోని పైగా టూంబ్స్‌కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్‌లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు.

వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అ‍ప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్‌ హసీబ్‌ అహ్మద్‌ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్‌ చేస్తామని మంత్రి కేటీఆర్‌,  పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కోరారు. 

చార్మినార్‌ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్‌ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్‌ వండర్‌గా పైగా టూంబ్స్‌ ఖ్యాతికెక్కింది. 

మరిన్ని వార్తలు