బిగ్ బజార్ బంపర్ ఆఫర్: రూ. 1500 షాపింగ్ చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్

23 May, 2021 15:34 IST|Sakshi

ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌ చైన్ బిగ్‌ బజార్‌ గుడ్ న్యూస్ తెలిపింది. తన వినియోగదారుల కోసం బిగ్ బజార్ 2021 మే 22 నుంచి మే 31 వరకు 'బిలీవ్ ఇట్ ఆర్ నాట్' ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద రూ.1500ల షాపింగ్ చేసిన వారికి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్ / పూర్తి లాక్‌డౌన్ విధించినందున బిగ్ బజార్ వినియోగదారులు బిగ్ బజార్ ఆన్‌లైన్ యాప్‌లో లేదా బిగ్‌బజార్‌లోని స్టోర్ షాపులో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందగలరు. 

బిగ్ బజార్ ఆన్‌లైన్ యాప్‌ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై కూడా రూ.1000 క్యాష్‌బ్యాక్, బుక్ చేసిన 2 గంటలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. "ఇంటి నుంచి షాపింగ్ చేయవచ్చు లేదా కరోనా మార్గదర్శకాల ప్రకారం వారు తమ సమీప దుకాణాన్ని సందర్శించవచ్చు" అని ఫ్యూచర్ గ్రూప్ గ్రూప్ సీఎమ్ఓ, డిజిటల్, మార్కెటింగ్, ఈ-కామర్స్ పవన్ సర్దా అన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో స్టోర్స్ కలిగి ఉన్న బిగ్ బజార్ ఫ్యూచర్ గ్రూప్ చెందింది. ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సిట్-డౌన్ చెక్ అవుట్స్, స్మార్ట్ కస్టమర్ సర్వీస్ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్ అనుభవాలను బిగ్ బజార్ అందిస్తుంది.

చదవండి:

ప్రతి నెల ప‌ది వేల పెన్ష‌న్ పొందాలంటే..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు