కొత్త సంవత్సరంలో కారు కొనడం కష్టమేనా.. పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు

4 Dec, 2023 10:32 IST|Sakshi

2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్‌లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్‌' వెల్లడించారు.

భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు..

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి.

>
మరిన్ని వార్తలు