డీజిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గింపు.. ఎంతంటే?

5 Mar, 2023 08:22 IST|Sakshi

విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ఎగుమతిపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ను లీటర్‌కు 50 పైసలు తగ్గించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు కంపెనీలకు లెవీ పన్నును మరో రూ.50 విధించింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ ధరలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది.

క్రూడ్ పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) టన్నుకు రూ.4350 నుండి రూ. 4400కు పెంచింది. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న డీజిల్‌పై పన్ను రూ.2.5 ఉండగా, దీనిని 50 పైసలు తగ్గించింది. అలాగే ఏటీఎఫ్‌పై విధిస్తున్న రూ.1.50 విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.  

భూమి నుండి, సముద్రపు అడుగుభాగం నుండి పంప్ చేయబడిన ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వంటి ఇంధనాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు