సెంచురీ మ్యాట్రెసెస్‌ అంబాసిడర్‌గా పీవీ సింధు

30 Aug, 2023 16:44 IST|Sakshi

మూడేళ్లలో 500 కొత్త స్టోర్లు: ఈడీ ఉత్తమ్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే మూడేళ్లలో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌ (ఈబీవో) సంఖ్యను 1,000కి చేర్చుకోనున్నట్లు సెంచురీ మ్యాట్రెసెస్‌ ఈడీ ఉత్తమ్‌ మలానీ తెలిపారు. ప్రస్తుతం 500 ఉండగా మరో 500 స్టోర్స్‌ ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణలో 100 ఈబీవోలు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 200కు పెంచుకుంటున్నామన్నారు.

మరోవైపు, దేశీయంగా మ్యాట్రెస్‌ల మార్కెట్‌ రూ. 10,000 కోట్లుగా ఉండగా సంఘటిత రంగ వాటా 40శాతం అని, ఇందులో తమకు 10% వాటా ఉందని, దీన్ని మూడేళ్లలో 20 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలానీ ఈ విషయాలు చెప్పారు. ఆదాయాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన స్లీప్‌ సొల్యూషన్స్‌ అందిస్తూ సెంచురీ అందరీ నమ్మకాన్ని చూరగొందని సింధు తెలిపారు.    

మరిన్ని వార్తలు