చంద్రయాన్‌-3  సక్సెస్‌: సోషల్‌మీడియాలో 45 ట్రిలియన్ డాలర్ల మోత

24 Aug, 2023 13:03 IST|Sakshi

బ్రిటీష్‌ మీడియా అక్కసు

మా కొహినూర్‌ మాకిచ్చేయండి: సోషల్‌  మీడియా ట్రెండింగ్‌

Chandrayaan-3 VS 45 Trillion చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. చంద్రయాన్‌-3 గ్రాండ్‌ సక్సెస్‌ తరువాత ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందించాయి. అయితే  బ్రిటీష్‌ మీడియాలో  జెలసీతో అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఇండియానుంచి బ్రిటిష్‌ వలసపాలకులు కొల్లగొట్టిన  45 ట్రిలియన్‌ డాలర్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. (చంద్రయాన్‌-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్‌ రికార్డ్‌)

సోషల్ మీడియాలో,ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్‌ మిషనను అభినందిస్తూనే చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన తర్వాత  గత ఎనిమిది సంవత్సరాలుగా యూకే నుంచి 2.5 బిలియన్‌డాలర్లను విదేశీ సహాయాన్ని  వెనక్కి ఇవ్వాలంటూ పాట్రిక్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన  సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్‌  శంకర్‌ ఝా  భారతీయులనుంచి దోచుకున్న45  ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ  కౌంటర్‌ ఇచ్చారు.

అలాగే అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇక దేశాలకు యూ​కే  సాయం అందించకూడదు అంటూ  సోఫియా కోర్కోరన్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు  తమ డబ్బు తిరిగి తమకు కావాలని కూడా  ఈమె పేర్కొన్నారు. దీంతో  భారతీయ యూజర్లు మండిపడుతున్నారు. భారతదేశం నుండి దోచుకున్న  సొమ్ము 45 ట్రిలియన్   డాలర్లు అని   కమెంట్‌ చేస్తున్నారు. మా కొహినూర్‌ మాకిచ్చేయండి అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు భారత్‌ 2015నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదంటూ  పేర్కొన్నారు.

కాగా 1765 -1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్‌డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పరిశోధన తర్వాత తొలుత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్ పన్ను  మరియు వాణిజ్యంపై దాదాపు రెండు శతాబ్దాల వివరణాత్మక డేటాను విశ్లేషించిన తర్వాత  ఈ డేటాను వెల్లడించారు.అయితే ఈ ఏడాది మార్చిలో ది గార్డియన్‌ నివేదిక ప్రకారం, భారతదేశానికి యూకే సహాయం 2015లో ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష ప్రకారం సుమారు 2.3 బిలియన్లు  పౌండ్లు (రూ. 23,000 కోట్లు) 2016 -2021 మధ్య భారతదేశానికి అందాయి.  (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు)

బ్రిటీష్‌ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్‌ ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దశాబ్దాలు పాటు భారత్‌ను పాలించిన బ్రిటీషర్లుమనదేశంలోని ఎనలేని సంపదను దోచుకుపోయారు. బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటి ఎంతోఘనమైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. 

మరిన్ని వార్తలు