Gold, Silver Prices Today: పుత్తడి, వెండి: కొనుగోలుదారులకు ఊరట

1 Jun, 2022 13:48 IST|Sakshi

  తగ్గిన బంగారం, వెండి ధరలు 

సాక్షి, ముంబై: జూన్‌ మాసం ఆరంభంలోనే వెండి, బంగారం ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు  బుధవారం (జూన్,1) ధరలు తగ్గుముఖం పట్టాయి.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)  పుత్తడి, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. 

ఆగస్టు 5, 2022న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 281 తగ్గి రూ. 50,700గా ఉంది. అదేవిధంగా, జూలై 5, 2022 నాటి వెండి ఫ్యూచర్లు రూ. 535 లేదా 0.88 శాతం క్షీణించాయి.  మునుపటి ముగింపు రూ. 61,125తో పోలిస్తే ఎంసీఎక్స్‌లో  కిలో రూ. 60,876  వద్ద కొనసాగుతోంది. 

హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 47,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి దాదాపు 300 తగ్గి ప్రస్తుత ధర 51, 820గా ఉంది. అలాగే  కిలో వెండి ధర 67వేల రూపాయలుగా ఉంది. మంగళవారం నాటితో పోలిస్తే 500 రూపాయలు  తగ్గింది. 

కాగా ఫెడరల్ రిజర్వ్ మనీ పాలసీ, డాలర్ బలం గత రెండు నెలలుగా పసిడిపై ఒత్తిడి పెంచుతోందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఈ ఏడాది జనవరిలో 200 రోజుల యావరేజ్‌ కిందికి చేరాయి. ఈ మేరకు ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో నెల. 200-రోజుల మూవింగ్ యావరేజ్‌ కంటే తక్కువగా ఉన్నందున సెంటిమెంట్  బలహీనంగా ఉందనీ, దీంతో  పసిడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్‌ కమోడిటీ  అండ్‌ కరెన్సీ ఎనలిస్ట్‌ భవిక్ పటేల్ అంచనా 

మరిన్ని వార్తలు