పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్‌ సీఈఓ

16 Oct, 2023 14:45 IST|Sakshi

పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు.  విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అ‍చ్చుతాపురంలోని లారస్‌- 2 యూనిట్‌ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్‌ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. 

అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు​‍​‍​‍-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి.

మరిన్ని వార్తలు