జియోఫోన్‌ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!

9 Nov, 2023 07:34 IST|Sakshi

ముంబై: కై–ఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్‌ కీప్యాడ్‌తో జియోఫోన్‌ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్‌ స్టోర్స్‌తో పాటు రిలయన్స్‌ డిజిటల్‌డాట్‌ఇన్, జియోమార్ట్‌ ఎలక్ట్రానిక్స్, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 

2.4 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్‌ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్‌ ఫోన్‌ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్‌ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

మరిన్ని వార్తలు