కరోనా కల్లోలం,మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..ఐటీ కంపెనీల అమలు!

18 May, 2022 15:13 IST|Sakshi

ప్రపంచ దేశాల్ని కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దిగ్గజ కంపెనీలు ఆఫీస్‌కు వచ్చి (హైబ్రిడ్‌ వర్క్‌) పని చేస్తున్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. ఉద్యోగులు వీలును బట్టి ఆఫీస్‌కు రావాలని, లేదంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయమని చెబుతున్నాయి.    


దివెర్జ్‌ నివేదిక ప్రకారం..టెక్‌ దిగ్గజం యాపిల్‌ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీపై వెనక్కి తగ్గింది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసులు, ఆస్పత్రి పాలవుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇంటర్నల్‌గా యాపిల్‌ సంస్థ ఉద్యోగులకు మెయిల్స్‌ పంపింది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగులు వారికి నచ్చినప్పుడు ఆఫీస్‌కు రావొచ్చని, లేదంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి విధులు నిర్వహించాలని మెయిల్స్‌లో పేర్కొన్నట్లు ది వెర్జ్‌ తన నివేదికలో చెప్పింది.

యాపిల్‌ ఏం చెబుతుందంటే!
ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని యాపిల్‌ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కామన్‌ వర్క్‌ స్పేస్‌, మీటిగ్‌ రూమ్స్‌, హాల్స్‌ ఇలా అన్నీ ప్రదేశాల్లో మాస్క్‌ వినియోగించాలని ఉద్యోగులకు యాపిల్‌కు జారీ చేసిన మెమోలో పేర్కొంది. ఒకవేళ ఆఫీస్‌లో పనిచేయడం ఇబ్బంది అని అనిపిస్తే ఇంటి నుంచి పనిచేయండని సూచించింది.

రాయిటర్స్‌ కథనం ప్రకారం
ఈ ఏడాది మిడ్‌ ఏప్రిల్‌ నుంచి అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. వైరస్‌ మహమ్మారికి కారణంగా దేశం మొత్తం మీద 20వేల మంది ఆస్పత్రి పాలవ్వగా..గత వారంలో 16,500 మంది ట్రీట్మెంట్‌ కోసం ఆస్పత్రిలో జాయిన్‌ అయినట్లు తెలిపింది.     

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!

మరిన్ని వార్తలు