మార్కెట్‌లో అస్థిరత.. లాభనష్టాల మధ్య సూచీల ఊగిసలాట

7 Sep, 2021 10:08 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌, ఏషియన్‌ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు ఉండటంతో మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే సెన్సెక్స్‌ అధికంగా పాయింట్లు లాభపడి ఆల్‌టైం హైకి చేరుకుంది.అయితే ఆ వెంటనే ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో క్రమంగా సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా పాయింట్లు కోల్పోతోంది. దేశీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,418 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పెరుగుతూ ఆల్‌టైం హై 58,459ని టచ్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్లు నష్టపోయి 58,269 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,401 పాయింట్ల వద్ద మొదలై వెంటనే నష్టాలను చవి చూసింది. ఒక దశలో 17,377 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ కోలుకుని ఉదయం పది గంటల సమయంలో 4 పాయింట్ల లాభంతో 17,381 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
చదవండి: ఎన్‌ఆర్‌ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్‌ 19 వేదిక

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు