లాభనష్టాల మధ్య మొదలైన సంవత్‌ 2078

8 Nov, 2021 09:49 IST|Sakshi

ముంబై : లాభనష్టాలతో కొత్త సంవత్‌ 2078 ‍ప్రారంభమైంది. దీపావళి పండుగ ముగిసిన తర్వాత తొలిరోజు ట్రేడింగ్‌ ప్రారంభం కాగా.. తొలి పది నిమిషాలు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాల దిశగా పయణించాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు మొగ్గు చూపడంతో వెంటనే నష్టాలు మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 60 పాయింట్లను మరోసారి చేజార్చుకోగా నిఫ్టీ 18 వేల మీద పట్టు నిలుపుకోలేకపోయింది.

ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో జోరు కనిపించింది. ఏకంగా 60,385 పాయింట్ల వరకు ట్రేడయ్యింది, కానీ కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోతూ ఉదయం 9:45 గంటల సమయానికి 75 పాయింట్లు నష్టపోయి 59,992 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 17,865 దగ్గర కొనసాగుతోంది.

కోటక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభపడగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఎండ్‌అండ్‌ఎం, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు