ఈ బ్యాంకు కస్టమర్లకు సర్‌ప్రైజ్‌: పండగ బొనాంజా

27 Sep, 2023 16:27 IST|Sakshi

DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తన సేవింగ్స్‌ ఖాతా,  ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది.  బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి.  రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది.  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  గరిష్ట వడ్డీరేటు  7.90 శాతంగా ఉంచింది.

సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు
ఒక  లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం  వడ్డీ  అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం  వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్‌ మహీంద్రపై చీటింగ్‌ కేసు, కంపెనీ క్లారిటీ ఇది)

బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 
7- 45 రోజుల  డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై  7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం  వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్‌లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది.  (డెల్టా కార్ప్‌ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్‌ చేస్తారా? అసలెవరీ మోడీ?)

మరిన్ని వార్తలు