ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త డేటా టాప్‌అప్‌ ప్లాన్‌

10 Sep, 2021 15:31 IST|Sakshi

కొంత కాలంగా స్థబ్ధుగా ఉన్న ఓటీటీలోకి ఈవారం నుంచే కొత్త సినిమాలు సందడి మొదలైంది. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ప్రతీ వారం మూడునాలుగు కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మూవీస్‌ చూడాలంటే మొబైల్‌ డేటాతో చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్‌టెల్‌ సం‍స్థ కొత్త డేటా టాప్‌ అప్‌ ప్లాన్‌ని అమల్లోకి తెచ్చింది.

డేటా ప్యాక్‌ రూ. 119
ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే రూ. 119 ప్యాక్‌ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ టాప్‌ అప్‌ ప్యాక్‌తో 15 జీవీ 4జీ డేటా లభిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఏ ప్యాకేజీలో ఉన్నారో ఆ ప్యాకేజీ గడువు ముగిసే వరకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. కాల్స్‌, వ్యాలిడిటీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే ఈ ప్యాక్‌ను ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తెచ్చింది.

చదవండి : డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్స్‌ కోసం గూగుల్‌ ’ల్యాబ్‌’
 

మరిన్ని వార్తలు