రియల్టీ మెరుగైన పెట్టుబడి సాధనం

19 Jan, 2022 08:56 IST|Sakshi

ప్రాపర్టీ తర్వాతే  ఫండ్స్‌/స్టాక్స్‌కి ప్రాధాన్యం 

2 బీహెచ్‌కే ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌

క్రిప్టో కరెన్సీపై కనిపించని ఆసక్తి

నో బ్రోకర్‌ రియల్‌ ఎస్టేట్‌ రిపోర్ట్‌ 2021  

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనంగా మెజారిటీ ప్రజలు పరిగణిస్తున్నట్టు నోబ్రోకర్‌ పోర్టల్‌ ప్రకటించింది. ఈ సంస్థ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో వార్షిక సర్వే నిర్వహించింది. 21,000 కస్టమర్ల అభిప్రాయాలతోపాటు, తన ప్లాట్‌ఫామ్‌పై 1.6 కోట్ల యూజర్ల డేటాబేస్‌ ఆధారంగా నివేదిక విడుదల చేసింది.  

- 76 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌ను ప్రముఖ పెట్టుబడి సాధనంగా చెప్పారు. ఇల్లు కొనుగోలు చేయడం వల్ల భద్రత ఏర్పడుతుందన్న భావన పెరిగినట్టు నోబ్రోకర్‌ తెలిపింది. 
- మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌లు/స్టాక్స్‌కు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ఎక్కువ మంది పరిగణిస్తున్నారు.  
- బిట్‌కాయిన్‌ గురించి చెప్పిన వారు చాలా తక్కువ మంది ఉన్నట్టు  నివేదిక పేర్కొంది.  
- రెండో ప్రాపర్టీ (ఇల్లు/ప్లాట్‌/ఫ్లాట్‌)ని పెట్టుబడి దృష్ట్యా 2022లో కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు 43 శాతం మంది తెలిపారు.  
- ప్రాపర్టీ కొనుగోలుకు ఇది అత్యంత అనుకూల సమయంగా 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచే పని చేసే విధానం, హైబ్రిడ్‌ పని నమూనా, బిల్డర్లు మంచి ఆఫర్లు ఇస్తుండడం, గృహ రుణాలపై రేట్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిల్లో ఉండడం వంటి అంశాలు ఈ ఫలితాలకు అనుకూలంగా ఉన్నట్టు నోబ్రోకర్‌ సంస్థ తెలిపింది.  
- 15 శాతం మంది రూ.కోటికి పైన ధర ఇళ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. 2020 సర్వే గణాంకాలతో పోలిస్తే 4 శాతం, 2019 సర్వేతో పోలిస్తే 8 శాతం అధికం. 
- 2బీహెచ్‌కే ఇళ్లకే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 37 శాతం మంది సర్వేలో 2 బీహెచ్‌కేకు ఓటు వేశారు.  
- ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు 78 శాతం మంది అనుకూలంగా ఇస్తున్నారు. 
- 73 శాతం మంది ఇంటి కొనుగోలులో వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.   

చదవండి: ఫ్లాట్‌ కంటే.. ప్లాటే బెటర్..? ప్రతియేడు ఇంత పెరుగుదలా!

మరిన్ని వార్తలు