సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

23 Nov, 2023 15:48 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమై, క్రితం రోజులో పోలిస్తే ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ 0.050 శాతం నష్టపోయి 19,802 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 0.0082 శాతం నష్టపోయి 66,017 వద్ద స్థిరపడింది. 

యూఎస్‌ బాండ్ల రాబడులు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లు బుధవారం రాణించాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆదివారం జరగాల్సిన ఒపెక్‌+ సమావేశం వాయిదా పడింది. దీంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పడిపోయాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర దాదాపు ఐదు శాతం మేర కుంగి 78.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.306 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.721 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 30 స్టాక్స్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, నెస్లే, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస​్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడయ్యాయి. ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు