డాయిష్‌ బ్యాంక్‌ 14% డౌన్‌

25 Mar, 2023 03:10 IST|Sakshi

ఫ్రాంక్‌ఫర్ట్‌: అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి.

బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్‌ బ్యాంక్‌ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్‌ బ్యాంక్‌ మరో క్రెడిట్‌ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ తోసిపుచ్చారు. బ్యాంక్‌ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు