ఇండిగోకు భారీ షాక్‌: నిబంధనలు పాటించడం లేదని!

28 Jul, 2023 17:07 IST|Sakshi

 ఇండిగోకు 30 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

పైలట్‌, కో పైలట్‌ లైసెన్స్‌ కేన్సిల్‌ 

బడ్జెట్‌ కారియర్ ఇండిగోకు భారీ షాక్‌ తగిలింది. ల్యాండింగ్ సమయంలో  తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా  ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ  జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.

బెంగళూరు నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్‌లను రెగ్యులేటర్  సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్  దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్  లైసెన్స్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు)

కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్  (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్‌వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో  నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది.  దీనిపై  రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్‌ నెక్లెస్‌ ఖరీదు తెలుసా?)

మరిన్ని వార్తలు