DRDO: 2-డీజీ డ్రగ్‌, కమర్షియల్‌ లాంచ్‌ 

28 Jun, 2021 11:32 IST|Sakshi

డా.రెడ్డీస్‌, డీఆర్‌డీవో  2 డీజీ ఔషధం కమర్షియల్‌ లాంచ్‌ 

లాభాల్లో డా.రెడ్డీస్‌ షేరు

సాక్షి, ముంబై:   దేశంలో  కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌  ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్‌ డెల్టా ప్లస్‌ ప్రజలను భయపెడుతోంది. ఈ క్రమంలో   దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్‌  న్యూస్‌ చెప్పింది.  కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్‌డీవో, రెడ్డీస్‌ సంయుక‍్తంగా  అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్‌ ఇక మార్కెట్‌లో లభ్యం కానుంది. సోమవారం 2డీజీ ఔషధాన్ని కమర్షియల్‌గా లాంచ్‌ చేసింది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.  99.5 శాతం సమర్ధత కలిగిన   ఈ 2డీజీ  సాచెట్   990  రూపాయల వద్ద  ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది. 

మొదట్లో తమ ఉత్పత్తి 2డీజీ ఔషధం మెట్రో, టైర్-1 నగరాల్లోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందనీ, ఆతరువాత భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ  అందుబాటులోకి తీసుకొస్తామని అని కంపెనీ ఒక ప్రకటన తెలిపింది. దీంతో  రెడ్డీస్‌ ఉదయం సెషన్‌లో షేర్ ధర ఒక శాతం ఎగిసింది. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్‌డీవో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్  అండ్‌ అలైడ్ సైన్సెస్  భాగస్వామ్యంతో  ఈ 2 డీజీ  డ్రగ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన  సాధారణ నుంచి తీవ్ర లక్షణాలున్న  కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా  దీన్ని ఉపయోగిస్తున్నారు.

చదవండి : కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్‌!  సీరం సీఈవో భరోసా

మరిన్ని వార్తలు