Sakshi News home page

Stock Exchange : కిమ్స్‌, దొడ్ల... శుభారంభం

Published Mon, Jun 28 2021 11:36 AM

Dodla Dairy, KIMS Hospitals Make Bumper Debut In Stock Exchange  - Sakshi

ముంబై : స్టాక్‌ ఎక్సేంజ్‌లో  దొడ్ల డెయిరీ, కిమ్స్‌ హస్పిటల్స్‌కి సంబంధించిన షేర్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు ఐపీవోను జారీ చేశాయి. అనంతరం జూన్‌ 28న తొలిసారిగా స్టాక్‌మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే ఈ రెండు సంస్థలకు చెందిన షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఉత్సాహాం చూపించారు. 

కిమ్స్‌ సానుకూలం
కిమ్స్‌ హాస్పిటల్‌ సంస్థ షేరు రూ. 825తో మొదలవగా కాసేపట్టికే 25 శాతం పెరిగి  రూ. 1034 దగ్గర గరిష్ట స్థాయికి చేరుకుంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సెంజీలో రూ. 1036 వరకు చేరుకుంది. కిమ్స్‌ షేర్ల ట్రేడింగ్‌ పట్ల మార్కెట్‌ సానుకూలంగానే ఉంది. సౌతిండియాలో కిమ్స్‌ ఆధ్వర్యంలో 9 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. 3,064 బెడ్ల సామర్థ్యం ఉంది.

దొడ్ల షేర్‌ ఇలా 
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డైయిరీ సంస్థైన దొడ్ల సైతం ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌ తొలి సారి లిస్టయ్యింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో దొడ్ల షేర్‌ 475 -525 మధ్యన ట్రేడ్‌ అవుతోంది. ఒక దశలో షేర్‌ వాల్యూ 33 శాతం పెరిగి రూ. 575 దగ్గర నమోదైంది. ఎన్‌ఎస్‌సీలో రూ. 572  దగ్గర ట్రేడ్‌ అవుతోంది.  ఈ రెండు సంస్థలకు సంబంధించి ఐపీవోలు జూన్‌ 16 నుంచి 18వరకు ముగిశాయి.

చదవండి : Mahindra XUV 700: మేఘాలలో తేలిపోమ్మనది

Advertisement

What’s your opinion

Advertisement