ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్‌!

14 Dec, 2022 15:53 IST|Sakshi

340 బిలియన్‌ డాలర్లతో స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ప్రథమస్థానంలో ఉన్నారు. అయితే ట్విటర్‌ కొనుగోలుతో ఆయన ఆస్తి కరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలొఓ  ఏకంగా 107 బిలియన్ డాలర్లు అంటే రూ.8.84 లక్షల కోట్లను కోల్పోయారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానాన్ని బెర్నార్డ్ అర్నాల్ట్ కైవసం చేసుకున్నారు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ తన సంపద జనవరిలో  $168.5 బిలియన్ల నుంచి $100 పైకి పడిపోయింది. దీంతో బుధవారం నాటికి ఆర్నాల్ట్ $172.9 బిలియన్ల నికర విలువ కంటే తక్కువగా ఉండటం..బెర్నార్ట్‌ మస్క్‌ కంటే 48 శాతం సంపద ఎక్కువ ఉండడంతో మస్క్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని కోల్పోయారు. 

చేజేతులా నాశనం 
వరల్డ్‌ నెంబర్‌ 1 రిచెస్ట్ జాబితాలో ఉన్న మస్క్‌ రెండో స్థానానికి పడిపోవడానికి కారణం ఆయనేనని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 2021 నుంచి నెంబర్‌ వన్‌ మల్టీ బిలియనీర్‌ స్థానంలో ఉన్న మస్క్‌ ఈ ఏడాది 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుతో మస్క్‌ సంపద మంచులా కరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా ఈ డీల్‌ను క్లోజ్‌ చేసేందుకు తన వద్ద తగినంద నిధులు లేకపోవడంతో ఏప్రిల్‌లో సుమారు $8.5 బిలియన్లు, ఆపై ఆగస్టులో మరో $6.9 బిలియన్ల విలువైన షేర్లను విక్రయించాడు. 

ఆర్ధిక మాంద్యం దెబ్బ
దీనికి తోడు ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌లు,  ఇతర సెంట్రల్‌ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను  విపరీతంగా పెంచాయి. వడ్డీ రేట్ల పెంపుతో కొనుగోలు దారులు ఖర్చు చేయడం తగ్గించారు. 

ఖర్చు చేయడం ఎప్పుడైతే తగ్గించారో..ఆటోమొబైల్‌ తయారీ సంస్థల షేర్లు 50 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. వెరసీ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్‌ వన్‌స్థానం నుంచి రెండో స్థానానికి దిగజారారు. ప్రస్తుతం మస్క్‌ స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ కొనసాగుతున్నారు. 

>
మరిన్ని వార్తలు