గుడ్‌న్యూస్‌,తొలిసారి ట్విటర్‌లో...మస్క్‌ క్లారిటీ!

19 Nov, 2022 12:10 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశారు. మైక్రో-బ్లాగింగ్ ట్విటర్‌లో ప్రపంచ కప్ కవరేజ్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. తొలి (ఫుట్‌ బాల్‌) మ్యాచ్‌పై ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త అందించారు.  ఆదివారం ప్రారంభం కానున్నప్రపంచకప్‌ ఫస్ట్‌ మ్యాచ్‌కు బెస్ట్‌ కవరేజ్‌, రియల్‌ టైం కమెంటరీ అందిస్తున్నట్టు  మస్క్‌ ట్వీట్‌ చేశారు. (మునుగుతున్న ట్విటర్‌ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!)

ట్విటర్‌ టేకోవర్‌ తరవాత ప్రతిరోజూ  ఏదో ఒక సంచలన, విచిత్రమైన ప్రకటనలతో వార్తల్లో ఉంటూ వస్తున్న మస్క్‌ తాజా ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా ట్వీట్‌తో ట్విటర్‌ ఇక మూతపడనుందనే ఊహాగానాలకు చెక్‌ చెప్పారు. అయితే ధృవీకరణగా ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించనప్పటికీ, నవంబర్ 20న ఖతార్‌లో  ఫిఫా ప్రపంచ కప్  షురూ కానుండంటంతో  దీనిగురించే  మస్క్‌  ట్వీట్‌ చేశారని అభిమానులు ధృవీకరించుకున్నారు. (ట్విటర్‌ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్‌!)

మరోవైపు రానున్న ఫిఫా వరల్ట్‌ కప్‌ కోసం  ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఉత్సాహంగా  ఎదురు చూస్తున్నారు. జపాన్-దక్షిణ కొరియాలో సంయుక్త జరిగిన 2002లో 17వ టోర్నమెంట్‌ తర్వాత ఇది మధ్యప్రాచ్యంలో తొలి, ఆసియాలో రెండో ప్రపంచకప్ కావడంతో మరింత ఆసక్తి  నెలకొంది.మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్ ఈక్వెడార్‌తో తలపడనుంది. ఇప్పటికే  ఆయా జట్లు ఖతార్ చేరుకున్నాయి. 

కాగా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో ట్విటర్‌ ద్వారా ప్రకటించిన సంగతి  తెలిసిందే. అయితే ఈ డీల్‌ పూర్తి చేసిందీ లేనిదీ క్లారిటీ లేదు. 

మరిన్ని వార్తలు