EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్‌..! ఎంతంటే..?

12 Jan, 2022 16:03 IST|Sakshi

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు భారీ ప్రయోజనాలను కల్పించే ప్రణాళికతో ముందుకు వస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుంది.

రూ. 9000 వరకు పెంపు..!
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో భాగంగా అసంఘటిత రంగ ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.9,000 పెంచేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. పెన్షన్‌ పెంపుపై ఇప్పటికే పలు సార్లు చర్చలు జరిగాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్‌పై నిర్ణయం తీసుకొనుంది.

అంతకుముందు ఈ కమిటీ మినిమం పెన్షన్‌ను రూ.1000 నుండి రూ.3000కు పెంచాలని మార్చి 2021లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమండ్ చేసింది. అయితే కనీస పెన్షన్ రూ.9000కు పెంచితేనే ఈపీఎస్-95 పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే సమవేశంలో కొత్త వేతన నియమావళి అమలు, (ఈపీఎస్‌) ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ వంటి రెండు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఉద్యోగి చివరి నెల జీతంపై..!
ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్‌ను ఖరారు చేయాలనే సూచన కూడా వచ్చింది. ఈ సూచనతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద కొత్త వేతన కోడ్ అమలు తదితర ముఖ్య అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈపీఎఫ్ఓ బోర్డు భేటీలో చర్చకు రావొచ్చునని తెలుస్తోంది.

చదవండి: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..!

మరిన్ని వార్తలు