బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sakshi
Sakshi News home page

బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Wed, Jan 12 2022 4:06 PM

Sensex Jumps 533 pts, Nifty Above 18200 pts - Sakshi

ముంబై: కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నేడు కూడా సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఈరోజు మొత్తం అదే జోరును కొనసాగించాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు రాణించడంతో సూచీలు జోరు తగ్గలేదు. అలాగే, నేడు టాప్‌ ఐటీ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఫలితాలు వెలువడనుండడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఆటో, రియాల్టీ, మెటల్, పవర్ స్టాక్స్ రాణించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. 

చివరకు, సెన్సెక్స్ 533.15 పాయింట్లు (0.88%) పెరిగి 61,150.04 వద్ద ఉంటే, నిఫ్టీ 156.50 పాయింట్లు (0.87%) లాభపడి 18,212.30 వద్ద ఉన్నాయి. నేడు నిఫ్టీలో ఎం అండ్ ఎం, భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీల షేర్లు రాణిస్తే.. టైటాన్ కంపెనీ, టీసీఎస్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సీప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మెటల్, పవర్, ఆటో, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ రంగాలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1 శాతం పెరిగాయి.

(చదవండి: శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ)

Advertisement
Advertisement