మ్యూజిక్‌ ఇష్టపడే వారికి ఫేస్‌‌బుక్‌ గుడ్‌న్యూస్‌..

1 Aug, 2020 18:19 IST|Sakshi

ముంబై: సంగీత ప్రియులకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ శనివారం శుభవార్త ప్రకటించింది. ఫేస్‌బుక్‌ తన అధికారిక సెక్షన్‌లో సంగీతానికి సంబంధించిన వీడియోలను(మ్యూజిక్‌ వీడియోలు)అందించనుంది. ఇప్పటికే సంగీత సంస్థలతో ఫేస్‌బుక్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గత సంవత్సరం నుండే దేశీయ సంగీత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ మానీష్‌ చోప్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.

కాగా మ్యూజిక్‌ ఫీచర్లు ఇండియా,ధాయ్‌లాండ్‌, యూఎస్‌ తదితర దేశాలలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫేస్‌బుక్‌కు వీడియోలు అందించే కంపెనీల వివరాలు టీసిరీస్‌ మ్యూజిక్‌, జీమ్యూజిక్‌ కంపెనీ, యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ తదితర కంపెనీలు వీడియోలు అందిస్తాయి. మరోవైపు సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, బీఎమ్‌జీ తదితర దిగ్గజ సంస్థలతో ఫేస్‌బుక్‌ కలిసి పనిచేయనుంది. వినియోగదారులు సంగీత వీడియోల సెక్షన్‌కు వెళ్లి కావాల్సిన కళాకారుల పాటలను కూడా వీక్షించగలరు. ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌, మెసెంజర్లతో వీడియోలను పంచుకోవచ్చు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు