కీలక నిర్ణయం, గేమింగ్‌ యాప్‌ను షట్‌డౌన్‌ చేయనున్న ఫేస్‌బుక్‌!

1 Sep, 2022 17:29 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో ఫేస్‌బుక్‌ గేమింగ్‌ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ యూజర్లు భారీగా తగ్గనున్నారు. 

2018లో గేమ్‌ స్ట్రీమింగ్‌, గేమింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌లో ట్విచ్‌, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ అడుగు పెట్టింది. రెండేళ్ల తర్వాత అంటే 2020లో గేమింగ్‌ యాప్‌, క్రియేటర్‌ పోగ్రాంను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ మిక్సర్‌ను సైతం కొనుగోలు చేసింది. 

ఈ నేపథ్యంలో స్పష్టమైన కారణాలేంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ..ఫేస్‌బుక్‌ తన గేమింగ్‌ యాప్‌ను స్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్‌ 28 నుంచి ఆ సేవల్ని వినియోగించుకోలేరని, వెబ్‌ బేస్డ్‌ వెర్షన్‌ గేమింగ్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పింది.

మరిన్ని వార్తలు