యాక్సిస్‌ ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌

23 Nov, 2022 09:16 IST|Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్, ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ చేతులు కలిపాయి. కొత్తగా ‘సూపర్‌ ఎలీట్‌ క్రెడిట్‌ కార్డు‘ను ఆవిష్కరించాయి. దీనితో ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌ప్లస్, క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్‌ హోటల్స్‌లో లావాదేవీలకు సంబంధించి రూ. 20,000 వరకు రివార్డ్‌ పా­యింట్లు పొందవచ్చు. ప్రతి లావాదేవీపై 4 రె­ట్లు ఎక్కువగా సూపర్‌కాయిన్స్‌ అందుకోవచ్చని ఫ్లిప్‌కా ర్ట్‌ ఎస్‌వీపీ ధీరజ్‌ అనేజా తెలిపారు. యాక్టివేషన్‌ బెనిఫిట్‌ కింద 500 ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌కాయిన్స్‌ పొందవచ్చని వివరించారు.    

మరిన్ని వార్తలు