పండగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ మరో ఆఫర్‌ !

15 Sep, 2021 12:54 IST|Sakshi

Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ కామర్స్‌ ఫ్టాట్‌ఫామ్‌పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి తదుపరి నెలలో బిల్‌ పే చేసే అవకాశాన్ని పే లేటర్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌  కల్పిస్తోంది. 

కొత్త వారికి అవకాశం 
ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ దేశవ్యాప్తంగా  ఎంపిక చేసిన  పది కోట్ల మంది కష్టమర్లకే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. పండగ సీజన్‌ని పురస్కరించుకుని మరింత మందికి పే లేటర్‌ అవకాశం కల్పిస్తోంది. పే లేటర్‌ ఆప్షన్‌ పొందాలని అనుకునే వారు ఆధార్‌కార్డు, బ్యాంకు డిటైల్స్‌ అందివ్వడం ద్వారా పే లేటర్‌ని ఏనేబుల్‌ చేసుకోవచ్చు. కొత్తగా పది కోట్ల మందిని ఈ ఆప్షన్‌ పరిధిలోకి తేవాలని ఫిప్‌కార్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో మోర్‌ ఆన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి క్రెడిట్‌ ఆప్షన్‌లోకి వెళితే పే లేటర్‌ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఆప్షన్‌ని పొందవచ్చు.

లిమిట్‌ పెంపు
పే లేటర్‌ ఆప్షన్‌లో ప్రస్తుతం క్రెడిట్‌ లిమిట్‌ కేవలం రూ. 10,000గానే ఉంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ. 70,000లకు పెంచుతూ ఫ్లిప్‌కార్ట్‌ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్‌లో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్‌ లిమిట్‌ను పెంచినట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. పే లేటర్‌ ఆప్షన్‌లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి ఏడాదిలోగా ఈఎంఐ పద్దతిలో చెల్లించే వీలు సైతం కల్పించింది.

పే లేటర్‌
ఈ కామర్స్‌ సైట్లలో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లులు చెల్లింపులు చేయడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులకు ఒకే సారి బిల్లును పొంది,ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఒకే సారి చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్‌కార్లు లేక కోనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న వారికి సైతం ఈ పే లేటర్‌ ఆప్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు...!

మరిన్ని వార్తలు