ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. 700 మిలియన్ డాలర్లు క్యాష్ పేఔట్!

27 Dec, 2022 18:53 IST|Sakshi

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు 700 మిలియన్‌ డాలర్‌ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ స్టాక్ ఆప్షన్స్ కలిగి ఉన్న దాదాపు 25,000 ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేయనుంది. ఫోన్‌పే (PhonePe), మింత్రా (Myntra), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సంస్థలోని ప్రస్తుత ఉద్యోగులే కాకుండా మాజీ సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరునుంది.

ఫ్లిప్‌కార్ట్‌లోని టాప్ 20 ఉద్యోగులు, కంపెనీలో అత్యంత సీనియర్‌ సిబ్బంది స్థాయి వారికి ఈ చెల్లింపులో దాదాపు 200 మిలియన్‌ డాలర్ల వరకు అందుకోనున్నారు. అమెజాన్ నుంచి ఫోన్‌పే (PhonePe) పూర్తిగా వేరు కావడంతో ఈ చెల్లింపు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌పేను 2015లో ఫ్లిప్‌కార్ట్  కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లో ఫోన్‌పే విలువను అన్‌లాక్ చేయడానికి దాన్ని ప్రత్యేక సంస్థగా మార్చింది. అయినప్పటికీ ఫోన్‌పేలో అధిక వాటాను కొనసాగించింది. ఇటీవల డిసెంబర్ 23న ఫోన్‌పేలోని తన వాటాలన్నింటినీ ప్రస్తుత వాటాదారులకు విక్రయిస్తున్న కీలక ప్రకటన చేసింది ఫ్లిప్‌కార్ట్‌. ప్రస్తుతం ఈ కామర్స్‌ దిగ్గజం అందిస్తున్న ఈ క్యాష్‌ పేఔట్‌ దేశీయ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఆఫర్‌గా నిలిచింది.

చదవండి: Meesho Shopping Survey: ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!

మరిన్ని వార్తలు