మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ

26 May, 2023 00:31 IST|Sakshi

బెర్లిన్‌: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది.

ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్‌ వీడియో 

వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్‌ దిగ్గజాలకు మస్క్‌ సంచలన సలహా)

మరిన్ని బిజినెస్‌వార్తలు, ఇ ంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షి బిజినెస్‌

మరిన్ని వార్తలు