Features Market : పెరిగిన గోల్డ్‌ .. తగ్గిన వెండి ధరలు

7 Jul, 2021 11:12 IST|Sakshi

ముంబై : మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఆగస్ట్‌ ఫీచర్‌కి బంగారం ధర రూ. 72 పెరిగింది. అంతకు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ, 47,684 దగ్గర ట్రేడవగా ఈ రోజు రూ. 72 పెరిగి రూ. 47, 756 దగ్గర నమోదు అవుతోంది. మరోవైపు వెండికి సంబంధించి సెప్టెంబరు ఫీచరు కిలో వెండి ధర రూ. 69,512 నుంచి 69,541కి పెరిగింది. జులై 6న కిలో ఒక దశలో వెండి రికార్డు స్థాయిలో రూ.70,309 రూపాయలు పలికింది. నిన్నటితో పోల్చితే వెండి ధర తగ్గింది. 

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. జులై 7న  గోల్డ్ ఫ్యూచర్స్ 7.45 డాలర్లు పెరిగి 1,801.65 డాలర్ల వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్కి సంబంధించి 0.108 డాలర్లు పెరిగి 26.282 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 
 

మరిన్ని వార్తలు