దిగొస్తున్న బంగారం ధర

24 Nov, 2020 06:27 IST|Sakshi

40 డాలర్లపైగా పతనం

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా దిగివస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ వార్తలు, ఈక్విటీ మార్కెట్ల ఆకర్షణ నేపథ్యంలో బంగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ వార్త రాసే సమయం రాత్రి 10.15 గంటలకు న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర గత శుక్రవారం (20వ తేదీ) ధరతో పోల్చిచూస్తే, 40 డాలర్లు పడిపోయి, 1,834 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,828 డాలర్లను కూడా చూసింది.

అమెరికా తయరీ, సేవల రంగాల సూచీలు రెండు అంచనాలకు మించి ‘58’కి పెరగడం దీనికి తక్షణ నేపథ్యం. నైమెక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా 2,089 డాలర్లు, 1,459 డాలర్లు. కాగా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్‌లోనూ పసిడి ధర ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ధర 10 గ్రాములకు రూ.792 నష్టంతో రూ.49,420 వద్ద ట్రేడవుతోంది. అయితే భారత్‌లో ధర కదలిక డాలర్‌ మారకంలో రూపాయి విలువ కదలికలపైనా ఆధారపడి ఉంటుంది. రూపాయి భారీగా క్షీణిస్తే, అంతర్జాతీయంగా ధర తగ్గిన ప్రభావం దేశంలో కనబడదు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ 74.11 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు