Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

22 Dec, 2023 12:38 IST|Sakshi

Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్‌ 22) మోస్తరుగా పెరిగాయి.  దేశంలో ఉన్న బంగారం నిల్వలు, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా భారత్‌లో బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 230 మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 63,230 లుగా ఉంది.  క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ.57,750, రూ. 63,000 ఉండేవి.

Silver Price Today: ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81, 000 లుగా ఉంది. ఇది నిన్నటి రోజు రూ.80,700 ఉండేది.

క్లిక్‌ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

>
మరిన్ని వార్తలు