LPG price cut: గుడ్‌న్యూస్‌.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

22 Dec, 2023 13:17 IST|Sakshi

కమర్షియల్‌ వంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలతల నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంటగ్యాస్ ధరను కాస్త తగ్గించాయి. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్‌ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. 

కమర్షియల్ వంట గ్యాస్‌ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్‌లో తెలిపాయి.

ఇదీ చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ 1న వాణిజ్య ఎల్‌పీజీ ధరను రూ.21 పెంచాయి. కమర్షియల్ వంట గ్యాస్‌ 19 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం ముంబైలో రూ. 1,710, కోల్‌కతాలో రూ. 1,868.50, చెన్నైలో రూ. 1,929 లుగా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

  • కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్‌ ఎల్‌పీజీ 14.2 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది.
>
మరిన్ని వార్తలు