ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ భారీ స్కెచ్‌..!

12 Mar, 2022 20:00 IST|Sakshi

గత 17 రోజల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యా బలగాలకు ఉక్రెయిన్‌ సైన్యం ధీటైన జవాబునిస్తున్నాయి. ఇక ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలపై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైనికులతో పాటుగా, సామాన్య ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రష్యన్‌ వైమానిక బాంబు దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు గూగుల్ వారికి సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ముందుగానే పసిగడుతోంది..!
రష్యన్‌ వైమానిక దళం ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాల్లో జరిగే ఎయిర్‌స్ట్రైక్స్‌ గురించి ‘ర్యాపిడ్‌ ఎయిర్‌ రైడ్‌’ ఉక్రెయిన్‌ ప్రజలను ముందుగానే  హెచ్చరికలను జారీ చేయనుంది. ఈ యాప్‌ ఉక్రెయిన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ యాప్‌ను తొలుత భూకంప హెచ్చరికలను గుర్తించడం కోసం గూగుల్‌ తీసుకొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌లోని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ అందుబాటులోకి వస్తోందని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డేవ్‌ బ్రుక్‌ వెల్లడించారు.

ఉక్రెయిన్లకోసం ఈ యాప్‌ను  గూగుల్‌ ప్లే స్టోర్స్‌లోకి  మార్చి 4న గూగుల్ వదిలింది. ఈ యాప్‌ సహాయంతో వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్‌ ప్రజలను అలర్ట్‌ చేస్తోంది. ఈ యాప్‌ను ఉక్రెయిన్ ప్రభుత్వం సహకారంతో ఉక్రేనియన్ డెవలపర్లు ఈ యాప్‌ను రూపొందించారు . ఇప్పుడు ఉక్రేనియన్లు థర్డ్-పార్టీ యాప్ లేకుండానే వారి ఫోన్ లొకేషన్, ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంటే వారు వైమానికి దాడుల అలర్ట్‌లను పొందగలరని గూగుల్‌ పేర్కొంది.

చదవండి: ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..!

మరిన్ని వార్తలు