Covid 19: కరోనాతో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు

23 Jul, 2021 16:46 IST|Sakshi

Covid-19: కోవిడ్-19 మహమ్మరి అంటువ్యాధి కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థల సిబ్బంది మరణిస్తే ఆ ఉద్యోగుల నామినీలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో అందించనున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులకు కోవిడ్-19 ఎక్స్ గ్రేషియాను చెల్లించాలని నిర్ణయించినట్లు జనరల్ ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్(జీఐఈఏఐఏ) అధికారి ఒకరు తెలిపారు.

ఈ నాలుగు బీమా సంస్థలలో ఒకటైన ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోవిడ్-19తో మరణించిన ఉద్యోగుల నామినీకి రూ.10 లక్షలను ఏకమొత్తంగా ఎక్స్ గ్రేషియాను చెల్లించినట్లు ప్రకటిస్తూ జూలై 22న సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి/జీవిత భాగస్వామి/ఆధారిత పిల్లలు, తల్లిదండ్రుల చికిత్స కోసం స్టాఫ్ గ్రూప్ మెడిక్లెయిం పాలసీ కింద కవర్ కానీ వైద్య ఖర్చులను కూడా 100 శాతం తిరిగి చెల్లిస్తామని బీమా కంపెనీ తెలిపింది.

"నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్కు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. మిగిలిన మూడు కంపెనీలు త్వరలో తమ సర్క్యులర్లతో బయటకు రావచ్చు" అని జీఐఏఐఏ ప్రధాన కార్యదర్శి కె. గోవిందన్ తెలిపారు.

మరిన్ని వార్తలు